ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నివాసంలో భారీ దొంగతనం జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలోకి కొంతమంది దుండగలు చొరబడి దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న 7.5 లక్షల రూపాయల నగదును దుండగులు చోరీ చేసినట్లు సమాచారం. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న జైపాల్ యాదవ్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన నివాసానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై విచార చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………………