* ఒకే కుటుంబంలో 18 మంది మృతి
* పరామర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సౌదీ బస్సు ప్రమాదం కుటుంబాన్ని బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 18 మందిని కబళించింది. హైదరాబాద్‌లోని విద్యానగర్ కు చెందిన నజీరొద్ధీన్ కుటుంబం సజీవ దహనమైంది. కుటుంబ సభ్యులతో కలిసి అంతా మక్కాకు వెళ్లారు. సౌదీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం అవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నాంటాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్ నజీరొద్ధీన్ ఇంటికి వెళ్లి బంధువులతో మాట్లాడారు. కుటుంబానికి అండగా ఉంటామని.. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. 17 మంది పురుషులు, 18 మంది మహిళలు 10 మంది చిన్నారులు ఉన్నట్లు తెలంగాణ హజ్ కమిటీ తెలిపింది.
………………………………………………………..
