ఆకేరు న్యూస్ కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం 09:55 నుంచి సాంకేతిక కారణాలతో సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ విఫలం అయింది. దీంతో మంగళవారం ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆగాల్సిన అప్, డౌన్ లైన్లలో రైళ్ళ హల్టింగ్ ను రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉప్పల్ లో ఆగాల్సిన అన్ని రకాల ట్రైన్స్ గత రోజు నుండి రద్దు కావడంతో ఉప్పల్ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.కాగా తాజాగా ట్రెయిన్ హల్టింగ్ రద్దును మరొక రోజు పొడిగించారు.రద్దుకు అనుగుణంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని రైల్వే అధికారులు సూచించారు. సిగ్నలింగ్, టెలి కమ్యూనికేషన్ పునరుద్ధరణ కోసం రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. పునరుద్ధరణ పనులను రైల్వే ఏడిఆర్ఎం పర్యవేక్షించారు.
రద్దు చేయబడిన అప్ రైళ్ల జాబితా:
17003 (KZJ-SRUR)
17033 (BDCR-SRUR)
17011 (HYB-SKZR)
12757 (SC-SKZR)
17233 (SC-SKZR)
డౌన్ రైళ్ల జాబితా :
17012 (SKZR-BIDR)
17234 (SKZR-SC)
17034 (SRUR-BDCR)
12758 (SKZR-SC)
17004 (ΒΡΟ-KZJ)
………………………………….