* ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5 వరకు రైళ్ల రద్దు
* రైల్వే అధికారుల వెల్లడి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : వరంగల్ -కాజీపేట – హసన్పర్తి రోడ్ రైల్వే స్టేషన్ల మధ్య నాల్గవ రైల్వే లైన్ల పనులు జరగనుండడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 5 వరకు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 23 నుంచి 28 వరకు నాన్ ఇంటర్ లాకింగ్ పనుల సన్నాహక పనులు జరగనున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5వ తారీఖు వరకు మూడు భాగాలుగా ఇంటర్ లాకింగ్ పనులు జరగనున్నాయి.
రద్దు చేయబడ్డ రైళ్ల వివరాలు
సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ మధ్య
17233 సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్నగర్ వెళ్లే భాగ్యనగర్ ఈనెల 22 నుంచి అక్టోబర్ 7 వరకు,
17234 సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్ ఈనెల 23 నుంచి అక్టోబర్ 8 వరకు,
17011 హైదరాబాద్ నుంచి కాగజ్నగర్ వెళ్ళు ఇంటర్సిటీ ఈనెల 28, 29, అక్టోబర్ 2,3,6,7 తేదీల్లో,
17012 కాగజ్నగర్ నుంచి బీదర్ వెళ్ళు ఇంటర్సిటీ ఈనెల 28,29, అక్టోబర్ 3,6,7 తేదీల్లో ,
12757 సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్ వెళ్లే రైలు ఈనెల 23 నుంచి వచ్చే నెల 7వరకు,
12758 కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఈనెల 23 నుంచి వచ్చే నెల 7వరకు రద్దు చేయబడ్డాయి
కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్నగర్ మధ్యన
17003 కాజీపేట నుంచి సిర్పూర్ వెళ్లాల్సిన రామగిరి మేము ఈ నెల 26 నుంచి అక్టోబర్ 07 వరకు ,
17004 సిర్పూర్ నుంచి కాజీపేట వెళ్లాల్సిన రామగిరి(మేము) ఈ నెల 26 నుంచి అక్టోబర్ 07 వరకు రద్దు చేయబడ్డాయి.
సిర్పూర్ కాగజ్నగర్ నుంచి భద్రాచలం మధ్యన
17034 సిర్పూర్ నుంచి కాజీపేట మీదుగా భద్రాచలం వెళ్ళాల్సిన సింగరేణి (మేము) రైలు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 08 వరకు,
17033 భద్రాచలం నుంచి కాజీపేట కాగజ్ నగర్ వెళ్లే సింగరేణి (మేము) రైలు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 07 వరకు రద్దు చేయడం జరిగింది.
కాబట్టి ప్రయాణికులు రైళ్ల వివరాలు తెల్సుకుని అందుకు తగిన విధంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకొవాలని రైల్వే అధికారులు సూచించారు.
………………………..