Published:
Updated: 31 Aug 2024 • 09:10 AM
* బంజారాహిల్స్ లో కారు బీభత్సం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు..రోడ్ నంబర్ రెండులో వెళ్తున్న కారు అదుపు తప్పి ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఎదుట ఉన్న పార్కింగ్ వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ కు గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో కారులో భార్తభర్తలు, నలుగురు పిల్లలు ఉన్నారు. వారు స్వల్ప గాయాలయతో బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
