* తొక్కిసలాట ఘటనపై పోలీసుల సీరియస్
* భద్రతా చర్యలు పాటించలేదని ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పుష్ప -2 సినిమా ప్రదర్శించిన సంథ్య థియేటర్(SANDHYA THEATOR) దగ్గర నిన్న విషాదం చోటుచేసుకుంది. సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవత్-భాస్కర్ దంపతులు పిల్లలు శ్రీతేజ్, సన్వీకలతో కలిసి పుష్ప ప్రీమియర్(PUSHPA PREMIOUR) చూసేందుకు సంధ్య 70 ఎంఎం ధియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో అభిమానులు గేటు లోపలకు చొచ్చుకు వచ్చారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ లు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పోలీసులు హాస్పటల్ కు తరలించగా, అప్పటికే రేవతి మృతి చెందింది. శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. సినీ హీరో అల్లు అర్జున్ (ALLU ARJUN)వచ్చే సమయం పై సరైన క్లారిటీ ఇవ్వకపోవడం పై నిర్వాహకులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు. రక్షణ చర్యలు పాటించకపోవడంతోనే విషాదం చోటుచేసుకుందని, నిర్లక్ష్యం వహించడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
……………………………..