ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. 93.66% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో అబ్బాయిల కంటే బాలికల ఉత్తీర్ణత 2.37% మెరుగ్గా ఉంది. సీబీఎస్ ఈ టెన్త్ ఫలితాల్లో దేశంలోనే దక్షిణ ప్రాంతాలు ముందున్నాయి, త్రివేండ్రం, విజయవాడ 99.79% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉన్నాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో తనిఖీ చేయవచ్చు cbse.gov.in, cbseresults.nic.in మరియు results.cbse.nic.in. DigiLocker, UMANG యాప్ మరియు SMS ఆధారిత సేవల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. డిజిటల్ మార్క్షీట్లను పొందచ్చని అధికారులు తెలిపారు.
………………………………………
