* జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్
ఆకేరున్యూస్, వరంగల్ : పుస్తక పఠనంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. హనుమకొండ నవ తెలంగాణ పబ్లిషర్ ఎదుట మంగళవారం పుస్తక ప్రదర్శనను ప్రారంభించుటకు వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ శ్రీధర్ సుమన్ మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలు ఎక్కువగా ఫోన్ల కు ఆకర్షితులై పుస్తకాలు చదవడానికి దూరంగా ఉంటున్నారు. అందువల్ల మానసిక రుగ్మతలకు దగ్గరవుతున్నారు. పుస్తక పఠనం అనేది ఒక వ్యక్తికి, సమాజానికి చాలా ఉపయోగకరమైన అలవాటు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, పదజాలం విస్తరిస్తుంది, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి.పుస్తకాలు చదవడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు, ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, మనస్సును చురుకుగా ఉంచుతుంది. ఇతరుల పట్ల సానుభూతి నేర్చుకోవచ్చు అని అన్నారు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయనీ తెలిపారు.పుస్తకాలు చదవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని,సృజనాత్మకత పెరుగుతుందనీ సూచించారు.పుస్తకాలు చదవడం ద్వారా నూతన ఆలోచనలు వస్తాయని,ఇతరుల భావనలను అర్థం చేసుకోగలగడం ద్వారా సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.పుస్తకాలు చదవ డం ద్వారా సమస్యలను విశ్లేషించగలిగే సామర్థ్యం పెరుగుతుందని,క్లిష్టమైన సమస్యలకు సులభమైన పరిష్కారాలను కనుగొనడానికి ఇది సహాయపడు తుందని,ప్రపంచం గురించి అవగాహన పెరుగు తుందని,వివిధ విషయాల గురించి చదివినప్పుడు, ప్రపంచం గురించి మరింత అవగాహన వస్తుందని, పుస్తక పఠనం ఒక మంచి అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం నవతెలంగాణ పబ్లిష్ బుక్ హౌస్ మేనేజర్ బండారి బాబు మాట్లాడుతూ పిల్లల పుస్తకాల సెట్స్ పై 50 శాతం రాయితీ ఇస్తుందని తెలిపారు అదేవిధంగా మిగతా పుస్తకాలపై 20 శాతం తగ్గింపు ఉంటుందని అన్నారు. వేసవికాలం దృష్ట్యా పుస్తకాలపై భారీ తగ్గింపు ధరలతో అందజేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
