ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో సిసిఐ కేంద్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంమ్జాద్ పాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్నిములుగు జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మహేందర్ జి కి అందజేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని. ఎలాంటి షరతులు లేకుండా రైతుల వద్ద పత్తి పంటను కొనుగోలు చేయాలని, డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆర్థిక విధానాలకు అనుకూలంగా తల ఊపి విదేశీ పత్తి పైన దిగుమతి 11% పన్నునుఎత్తివేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 50 లక్షల స్వదేశీ పత్తి రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిసిఐ కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకుండా పత్తి రైతులను ప్రైవేటు వ్యాపారస్తులకు తక్కువ ధరకు అమ్ముకునే విధంగా స్వదేశీ రైతులు ల నష్టాల పాలు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ములుగు జిల్లాలోని తక్షణమే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో వెంటనే ప్రారంభించి రైతుల వద్ద ప్రతి పంటను ఇలాంటి షరతులు లేకుండా. కొనుగోలు చేయాలని, కిసాన్ కాపాస్ యాప్ ను ఎత్తివేయాలని, పాత పద్ధతిలో ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయాలని,తేమ శాతాన్ని 20 శాతం వరకు పెంచాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జరిగింది. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ములుగు మండల కార్యదర్శి ముత్యాల రాజు. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఇంజన్ కొమురయ్య. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు. జేరిపోతులపైడయ్య, బండ రాజు, భూక్యరాంజి, తదితరులు పాల్గొన్నారు.

…………………………………
