* ఇంధన ధరలు తగ్గించనున్నట్లు ప్రకటన
(ఆకేరు న్యూస్ డెస్క్ : దీపావళి పండుగ(deepavali festival) వేళ ప్రజలకు కేంద్రం శుభవార్త తెలిపింది. త్వరలోనే పెట్రోలు(petrol), డీజిల్(desil) ధరలు తగ్గించనున్నట్లు ప్రకటించింది. కొద్ది రోజులుగా పెరుగుతున్న ధరలతో ప్రజలకు ఈ ప్రకటన ఉపశమనం కలిగించనుంది. పెట్రోల్, డీజిల్ ను తక్కువ ధరలకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్ధిప్ సింగ్ పూరి(hardipsingh puri) సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. త్వరలోనే పెట్రోల్ ధర లీటరుకు రూ. 5 తగ్గుతుందన్నారు. డీజిల్ లీటర్ కు రూ. 2 తగ్గుతుందని తెలిపారు. ధరల్లో ఈ మార్పులతో లక్షలాది మందికి ఉపశమనం లభిస్తుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం చివరిసారిగా మార్చిలో ఇంధన ధరలను రూ. 2 వరకుతగ్గించింది. అప్పటి నుంచి ధరలు అలాగే ఉన్నాయి.
……………………………………………………………………