AEES Recruitment
* 254 పోస్టులతో నోటిఫికేషన్
* నవంబర్ 22 చివరి తేదీ
* టీచింగ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆకేరు న్యూస్, డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ అణుశక్తి శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ (AEES) దేశవ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 254 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నియామకాల్లో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), లైబ్రేరియన్, PRT మ్యూజిక్, బల్వాటిక టీచర్ పోస్టులు ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు 4, వైస్ ప్రిన్సిపల్ పోస్టు 1, PGT పోస్టులు 27, TGT పోస్టులు 102, లైబ్రేరియన్ పోస్టులు 13, PRT పోస్టులు 89, PRT మ్యూజిక్ పోస్టులు 10, బల్వాటిక టీచర్ పోస్టులు 8 ఉన్నాయి.
దరఖాస్తు గడువు
ఈ ఉద్యోగాలకు నవంబర్ 2, 2026 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 22, 2026 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే తేదీ వరకు దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
విద్యార్హతలు
పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. PGT పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ అర్హత అవసరం. TGT పోస్టులకు సంబంధిత డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్ పేపర్-2 అర్హత అవసరం. మిగిలిన పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
ఎంపిక విధానం, ఫీజు
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నారు. సాధారణ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750తో పాటు రూ.250 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అయితే వీరు రూ.250 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
అర్హత కలిగిన అభ్యర్థులు అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదివి, విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలను తెలుసుకోవాలి.
అధికారిక వెబ్సైట్ : https://www.aees.gov.in/
ఆన్లైన్ దరఖాస్తు : https://aees.onlineregistrationforms.com

Please tell us what is wrong. Your report will be sent to the website team.

