
* ఆ భారం ప్రజలపై పడదు
ఆకేరు న్యూస్, డెస్క్ : పెట్రోలు ధరల పంపుపై కేంద్ర ప్రభుత్వం (CENTRAL GOVERNMENT) క్లారిటీ ఇచ్చింది. ప్రజలపై పెట్రోలు ధరల భారం ఉండదని ప్రకటించింది. ఎక్సైజ్ సుంకాన్ని చమురు కంపెనీలే భరిస్తాయని తెలిపింది. పెట్రోలు ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పూ(NO CHANGE) ఉండబోదని పేర్కొంది. రిటైల్ ధరల్లో మార్పులు చేయవద్దని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. కాగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్(PETROL), డీజిల్(DIESEL) తదితర పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నాలుగేళ్లలో మొట్టమొదటిసారి బ్యారెల్ ముడి చమురు ధర 65 డాలర్లకు(రూ. 5,560) పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌కు మించి సరఫరా జరగడం వల్ల రోజురోజుకూ ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. అయినా కేంద్రం ధరలు తగ్గించకపోగా, పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 ఎక్సైజ్ సుంకం విధించిందని గగ్గోలు పెట్టాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
………………………………….