Warangal Crime
Warangal Crime: ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక 21 ఏళ్ల నవవధువు బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు.
ఒడిశాకు చెందిన గుప్తేశ్వర్ బిష్యాల్కు మిల్లీ బిష్యాల్ (21)తో ఈ ఏడాది జూన్ 14న వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ధర్మారంలో అద్దె ఇంట్లో దంపతులు కాపురం పెట్టారు. కొంతకాలం తర్వాత భార్యపై అనుమానంతో గుప్తేశ్వర్ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ నెల 8న మిల్లీ తన తల్లికి ఫోన్ చేసి.. భర్త తనను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని లేదా చనిపోవాలని వేధిస్తున్నాడని కన్నీటిపర్యంతమై చెప్పినట్లు సమాచారం. అనంతరం కొద్దిసేపటికే ఆమె ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.
ఘటనపై మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు భర్త గుప్తేశ్వర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
