తెలంగాణలో 37 కార్పోరేషన్లకు చైర్మన్ల నియామకం
-
పటేల్ రమేశ్ రెడ్డికి- పర్యాటక అభివృద్ధి కార్పేరేషన్
-
బెల్లయ్య నాయక్ కు – గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్
-
బండ్రు శోభారాణి – మహిళా కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఎన్నికల నగారా మోగిన వేళ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 37 కార్పోరేషన్ లకు చైర్మన్లను నియమించారు. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి పెద్ద పీట వేశారు. ఎన్నికల్లో విజయం సాధించాలంటే తప్పనిసరిగా పదవుల పంపకం జరగాల్సిందేనని రేవంత్ రెడ్డి భావించినట్టున్నారు. అందుకే ఏకంగా 37 మందికి ఒకేసారి చైర్మన్ పదవులను కట్టబెట్టారు.
1 పటేల్ రమేశ్ రెడ్డి – తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ 2. కే. శివసేనా రెడ్డి – తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 3. ఎన్ .ప్రీతమ్ – ఎస్సీ కార్పోరేషన్ 4. నూతి శ్రీకాంత్ – బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ 5. ఎస్ అన్వేష్ రెడ్డి – సీడ్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 6. అనిల్ ఎరావత్ – మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 7. ఎం . విజయ్ బాబు – కో ఆపరేటివ్ హౌజింగ్ ఫెడరేషన్ 8. రాయల నాగేశ్వర్ రావు- వేర్ హౌజింగ్ కార్పోరేషన్ 9. కాసుల బాలరాజు – ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ 10 . నేరేళ్ళ శారద- మహిళా కమిషన్ 11. బండ్రు శోభారాణి – మహిళా కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ 12.సీహెచ్ జగ దీశ్వర్ రావు – ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ 13. జంగా రాఘవరెడ్డి – ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ 14. మానాల మోహన్ రెడ్డి – కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ 15. బెల్లయ్య నాయక్ – గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 16. ఆర్ . గురునాథ్ రెడ్డి – పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ 17. జ్ఞానేశ్వర్ ముదిరాజ్ – డైరీ డెవలప్మెంట్ కో ఆఫరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 18. చల్లా నర్సింహ్మా రెడ్డి – అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ 19. మెట్టు సాయికుమార్ – ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ 20 . కోతకు నాగు – ఎస్టీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ 21. జనక్ ప్రసాద్ ( ఐఎన్టీయూసీ ) – మినిమమ్ వేజెస్ అడ్వయిజరీ బోర్డ్ 22. ఎండీ రియాజ్ – గ్రంథాలయ పరిషత్ 23. ఎం. వీరయ్య- తెలంగాణ వికలాంగుల కార్పోరేషన్ 24. నాయుడు సత్యనారాయణ – హ్యాండి క్రాప్ట్స్ కార్పోరేషన్ 25. ఎంఏ జబ్బార్ – వైస్ చైర్మన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పోరేషన్ 26. నిర్మలా జగ్గారెడ్డి – ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ 27. రామ్ రెడ్డి మల్ రెడ్డి – రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ 28. కాల్వ సుజాత – వైశ్య కార్పోరేషన్ 29. పొడెం వీరయ్య – ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ 30 . ఐతా ప్రకాశ్ రెడ్డి – స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ 31. కే నరేందర్ రెడ్డి – శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ , కరీంనగర్ 32. అలేఖ్య పంజాల – సంగీత నాటక అకాడమీ 33. ఎన్ గిరిధర్ రెడ్డి – ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 34. మన్నె సతీష్ కుమార్ – టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ 35. జేరిపేటి జయ్పాల్ – మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ 36.ఈ వెంకట్రామి రెడ్డి – కాకతీయ అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ – వరంగల్ 37.ఎంఏ ఫాహిమ్ – తెలంగాణ ఫుడ్స్