*ఎయిర్ పోర్ట్ లో తెలుగువారి స్వాగతం
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా లండన్ కు వెళ్లారు. వ్యక్తిగత పనుల మీద లండన్ వెళ్లిన చంద్రబాబు దంపతులకు లండన్ లో నివసిస్తున్న తెలుగువారులండన్ విమానాశ్రయంలో సాదరంగా స్వాగతం పలికారు. తెలుగు వారిని ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు దంపతులు అక్కడ నుండి వారు ఉండే బసకు వెళ్లిపోయారు. . ఈనెల 4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి నారా భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ఆమె అందుకోనున్నారు. అలాగే ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో నారా భువనేశ్వరి కృషికి గుర్తింపు రావడంతో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు వరించింది. గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమాల్లో హాజరు కావడానికి చంద్రబాబు దంపతులు లండన్ వెళ్లారు.
……………………………………..
