* మరోసారి ఉత్తరాంధ్రనేతకే పార్టీ పగ్గాలు
ఆకేరు న్యూస్, మంగళగిరి : ఏపీ(Andhra Pradesh) లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం(TDP) పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాలనతోపాటు పార్టీలోనూ మార్పులు చేపడుతోంది. గాజువాక(Gajuwaka) ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్( MLA Palla Srinivasa Rao Yadav) కు తాజాగా పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది. ఆయనను విశాఖ(Visakha) పార్లమెంట్ పార్టీ నాయకుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన పల్లాను ఏపీ అధ్యక్షుడిగా(AP President) గా నియమిస్తున్నట్లు చంద్రబాబు(AP CM Chandrababu) ప్రకటించారు. ఈ మేరకు మంగళగిరి(Mangalagiri) లోని ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. పల్లా శ్రీనివాసరావు యాదవ్ నూతన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఇప్పటి వరకు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కింజరాపు అచ్చెన్నాయుడికి రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కడంతో పార్టీ పదవీ బాధ్యతల నుంచి తప్పించారు. పల్లా నియామకంతో మరోసారి ఉత్తరాంధ్ర నేతకే పార్టీ పగ్గాలు అప్పగించినట్లయింది.
——————-