* చెక్ పోస్టులను రద్దు చేస్తూ సీఎం ఆదేశం
* తక్షణమే అమలుకు ఉత్తర్వులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులను ఎత్తి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఉత్తర్వులు అమలు అవుతాయని తెలిపారు.సీఎం రేవంత్ ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆకస్మిక, తక్షణ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ఆదేశించారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తెలంగాణ లో చెక్కు పోస్టులు రద్దు ఈరోజు నుండి అమలు చేస్తూ జీవో జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ నిర్ణయాన్ని రెండు నెలల క్రితమే తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు. దీంతో హైదరాబాద్ లో పొల్యూషన్ ను అరికట్టవచ్చన్నారు. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు
