* బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి
ఆకేరు న్యూస్, ఆఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపింది. బజార్ హత్నూర్ మండలం డెడ్రాలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది. చిరుత దాడి(Chirutha Attack)లో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు గమనించి.. చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితురాలిని భీమాబాయిగా గుర్తించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ(Telangana)లో వరుసగా చిరుత దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పులి దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయింది. కాగజ్‌నగర్ మండల పరిధిలోని బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ పులికి బలైంది.
………………………………………