* తెలంగాణకు పెట్టుబడుల కోసం ప్రతినిధులతో భేటీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేట్లో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ఇండో-యూఎస్ సమ్మిట్‌లో హాజరుకున్నారు. డిసెంబరు 8, 9 తేదీల్లో రెయిజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ లో ఇండో-యూఎస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ సమ్మిట్‌కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ అయి వారిని రేవంత్ రెడ్డి (Revanthreddy) రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. అలాగే.. ఢిల్లీ పర్యటన సందర్బంగా కాంగ్రెస్ అగ్రనేతలను, రాష్టాభివృద్ది పనులకు సంబంధించి కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా దీనిపై స్పష్టత లేదు. ప్రధానంగా మెట్రో రైలు (Metro rail) విస్తరణ, మూసీ (Musi) ప్రక్షాళన ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల కోసం ఆయన కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని తెలిసింది. ఈరోజు రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
…………………………………….
