ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ హీరో, మెగాస్టార్ చిరంజీవికి కూడా సైబర్ వేధింపులు తప్పలేదు. ఇటీవలే డీప్ ఫేక్ (Deep Fake) బారిన పడి కోర్టును ఆశ్రయించిన ఆయన తాజాగా మరోసారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకరిపై ఫిర్యాదు చేశారు. ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటినుంచి వీరు మరింత వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని, అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులు తెలిపారు.
………………………………………
