* టికెట్ల ధరల పెంపుపై పిటిషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విజయ గోపాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. బెనిపిట్ షో, టికట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం హౌస్ విచారణను నిరాకరించింది. కోర్టు పనిదినాల్లో పిటిషన్ వేసుకోవాలని పిటిషనర్ కు సూచించింది. దీంతో న్యాయవాది విజయ గోపాల్ ఈ నెల 19న పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా, మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయంతో థియేటర్లలో భారీ కలెక్షన్లపై అంచనాలు పెరిగాయి.
……………………………………..

