Chiranjeevi 158th Movie
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈ ఏడాది బర్త్ డే మరింత స్పెషల్‌గా మారనుంది. ఆయన 158వ సినిమాగా తెరకెక్కుతున్న బాబీ కొల్లి ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ‘కదిరి’ అనే టైటిల్‌ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టీజర్‌తో అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
* భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్ కూడా నిర్వహించినట్లు సమాచారం. అంతేకాదు, గతంలో విడుదలైన బీటీఎస్ వీడియోలో సినిమా మేకింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ స్థాయిలో రూపొందిస్తున్న విధానం కనిపించింది.
* అయినా క్రేజ్ తగ్గలేదు
చిరంజీవి స్వయంగా ఓ కార్యక్రమంలో తన 158వ సినిమా టైటిల్ గురించి అనుకోకుండా క్లూ ఇవ్వడంతో ‘కదిరి’ అనే పేరు బయటకు వచ్చింది. దీంతో అధికారిక ప్రకటనకు ముందే సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. గతంలోనూ చిరంజీవి సినిమాల టైటిల్స్ విషయంలో ఇలాంటి ‘చిరు లీక్స్’ ఆసక్తిని పెంచిన సందర్భాలు ఉన్నాయి. ఈనెల 22న తన బర్త్ డే రోజున.. మెగా 158 టైటిల్‌తో పాటు ఫస్ట్ టీజర్‌ను కూడా అదే రోజు విడుదల చేయనున్నారు.
* బాబీ–చిరు కాంబో..భారీగా అంచనాలు
‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి ఉంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాను భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సూచిస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
