Anirudh Kavya Maran Wedding Rumours
* గ్రీస్‌లో నవంబర్ 10న అనిరుధ్ –కావ్య మారన్ పెళ్లి?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. నవంబర్ 10న గ్రీస్‌లో వీరి వివాహం జరగనుందని లెట్స్ సినిమా ఓ కథనాన్ని ప్రచురించింది.
* గతంలోనూ ఇలాంటి ప్రచారమే..
అనిరుధ్, కావ్య మారన్ పేర్లు జత కావడం ఇదే తొలిసారి కాదు. 2025లో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలపై అనిరుధ్ స్వయంగా స్పందించారు. ఎక్స్ వేదికగా పెళ్లి వార్తలను ఖండిస్తూ.. అభిమానులు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు.
* అనిరుధ్, కావ్య ఎవరు?
అనిరుధ్ రవిచందర్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడిగా గుర్తింపు పొందారు. ‘లియో’, ‘ఇండియన్ 2’, ‘వేట్టయన్’, ‘విడాముయర్చీ’, ‘కూలీ’ వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. ఇక కావ్య మారన్.. సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఆమె సన్ టీవీ నెట్‌వర్క్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమానిగా కూడా ఉన్నారు.
* అనిరుధ్ పెళ్లిపై మామ ఆసక్తికర వ్యాఖ్యలు
నెల రోజుల క్రితం ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వై.జి. మహేంద్రన్ అనిరుధ్ పెళ్లి గురించి మాట్లాడారు.“ అతను చాలా పెద్ద వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇది ఖచ్చితంగా జరగబోతోంది. వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యల్లో వధువు ఎవరో మాత్రం చెప్పలేదు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
