ఆకేరున్యూస్, అమరావతి: ప్రముఖ నటుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వరించిన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్లో ఆయనకు చోటు లభించింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ అంశంపై మరో రెండు లేదా మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
…………………………………….