* కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపండి
* రైతు రుణమాఫీ చేశామో, లేదో తెలుస్తది
* వచ్చేందుకు డబ్బుల్లేకపోతే నేనే విమానం పంపిస్తా
* ముంబైలో తెలంగాణ సీఎం
ఆకేరు న్యూస్, ముంబై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(NARENDRA MODI)కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY) సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వంపై మోదీ విమర్శలను తిప్పికొట్టారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ(RYTHU RUNA MAPHI) చేశామన్నారు. ముంబై(MUMBAI)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 11 ఏళ్ల కాలంలో మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వం, కేంద్రం చేసింది ఏమీ లేవన్నారు. అందుకే బాంబు పేలుళ్లు, ఇతరాత్ర అంశాలను ఎన్నికల ముందు తెరపైకి తెస్తారని విమర్శించారు. 2014కు ముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, దేశంలోని ప్రతి పేదవానికీ ఇళ్లు కట్టిస్తామని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు.
కానీ ఏదీ అమలు చేయలేదన్నారు. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామని, చేశామని వివరించారు. 2 లక్షల రుణం ఉన్న రైతులకు 25 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేశామని, 23 లక్షల కుటుంబాలకు మాఫీ అమలు చేశామని వివరించారు. ఈమేరకు ప్రధానికి సవాల్ చేస్తున్నానని, కేంద్రం(CENTRAL) తరఫున ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని తెలంగాణకు పంపాలని, తెలంగాణకు రావడానికి డబ్బుల్లేకపోతే తానే విమానం పంపిస్తానని చెప్పారు. ఇచ్చిన హామీల్లో విఫలమైన మోదీ ప్రభుత్వం.. కర్ణాటక(KARNATAKA), తెలంగాణ(TELANGANA), హిమాచల్ ప్రదేశ్ (HIMACHAL PRADHESH)లలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తోందన్నారు.
……………………………………………………….