* రూ. 127.65 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ
ఆకేరు న్యూస్, వేములవాడ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) వేములవాడలో పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలో పలువురు బీఆర్ ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించడంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, వేములవాడ రాజన్న(VEMULAWADA RAJANNA) ఆలయానికి చేరుకున్న సీఎం ప్రత్యేక పూజలు చేశారు. 127.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజన్న ఆలయానికి వరాల జల్లు కురిపించారు. అనంతరం జరిగిన ఓ కార్యక్రమంలో గల్ప్ మృతుల కుటుంబాలకు పరిహారం చెక్కులు అందజేశారు. కాసేపట్లో బహిరంగసభలో మాట్లాడనున్నారు.
……………………………………..