
* కనీస సౌకర్యాలు కల్పించండి
* రాష్ట్రంలో దారుణంగా కరెంట్ కోతలు
* సెల్ ఫోన్ లైటు వెలుతురులో ఆస్పత్రుల్లో చికిత్స
* మాజీ మంత్రి హరీశ్ రాదు ధ్వజం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో పాలన పడకేసిందని, కరెంట్ కోతలు దారుణంగా ఉన్నాయని ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు (HARISHRAO) ధ్వజమెత్తారు. ప్రధాన ఆస్పత్రుల్లో సైతం సెల్ ఫోన్ వెలుగుల్లో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇంక గ్రామీణ ఆస్పత్రుల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 300కు పైగా పేషెంట్లు వచ్చే జహీరాబాద్ (JAHEERABAD)ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కరెంట్ కోతలపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గారూ.. గాలిలో మెడలు కట్టడం మానేసి, కనీస సౌకర్యాలు కల్పించాలని హితవు పలికారు. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు ఆసుపత్రిలో ఉన్న జనరేటర్ పని చేయదని దుయ్యబట్టారు.
…………………………………………….