* ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఎన్నికల ప్రచారం సమయంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు గాను ఓ ఎమ్మెల్యేకు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చేసిన కేసులో నాడు సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) అభ్యర్థి, ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ (Abbas Ansari) కి ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం మావు జిల్లాలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో దోషిగా తేలిన అబ్బాస్ అన్సారీ సన్నిహితుడు మన్సూర్ అన్సారీకి కూడా కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులలో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీ, అతడి సన్నిహితుడు మన్సూర్ అన్సారీలను ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఉదయం దోషులుగా తేల్చింది. అనంతరం అబ్బాస్ అన్సారీకి రెండేళ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. మన్సూర్ అన్సారీకి ఆరు నెలల జైలుశిక్ష విధించింది.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
