* బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం
* కవితకు రాజ్యసభ, బెయిలు కూడా వస్తుంది
* సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : భారతీయజనతా పార్టీ(Bharatiya Janatha Party)లో బీఆర్ ఎస్(Brs) విలీనంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ(New Delhi)లో ఈరోజు మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(Bjp)లో బీఆర్ఎస్ (Brs) విలీనం జరుగుతుందని తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex Cm. Kcr)కు గవర్నర్(Governor), కేటీఆర్(Ktr)కు సెంట్రల్ మినిస్టర్ (Central Minister) పదవులు దక్కుతాయని జోష్యం చెప్పారు. బీఆర్ ఎస్‌కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వాళ్ల విలీనంతో కవిత(Kavitha)కు రాజ్యసభ వస్తుందన్నారు. బెయిలు కూడా వస్తుందని పేర్కొన్నారు. హరీశ్‌రావు(HarishRao) అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని సీఎం రేవంత్ (Cm Revanth)కీలక వ్యాఖ్యలు చేశారు.
————————