ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
* మహానగరంలో ఆధ్యాత్మిక శోభ
* జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
* గోల్కొండలో బోనాల ఉత్సవాల్లో డ్యాన్స్ చేసిన పొన్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఒకవైపు జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra), మరోవైపు బోనాలు ప్రారంభమయ్యాయి. ఇస్కాన్ (ISKCON) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ప్రారంభించారు. రథానికి ప్రత్యేక పూజలు చేశారు. తమ ప్రభుత్వం మత సామరస్యానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఇస్కాన్ కు సంపూర్ణ సహకారాలు ఉంటాయని తెలిపారు. కాగా, రథయాత్ర నగరవ్యాప్తంగా కొనసాగుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ వరకూ సాగనుంది. మరోవైపు.. గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్లమ్మ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొన్నారు. పోతరాజులతో కలిసి నృత్యం చేశారు. ఇదిలాఉండగా, అమ్మకు బో్నాలు సమర్పించేందుకు మహిళలు బోనాలతో తరలివస్తున్నారు.
—————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
