CM Revanth Reddy London US Visit
* సీఎం రేవంత్రెడ్డి కీలక ట్వీట్..
* లండన్ నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణం..
అకేరు న్యూస్ హైదరాబాద్ : విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకుని లండన్ నుంచే హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైనట్లు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిందని ఆరోపించారు.
తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగిసిందని పేర్కొన్న సీఎం.. మరికొద్ది గంటల్లో హైదరాబాద్కు చేరుకుంటానని, హైదరాబాద్కు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని ట్వీట్లో తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
