
It is my fortune to tie a rakhi on this hand: Seethakka
* సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన సీతక్క
*డిప్యూటీ సీఎం, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి కోమటి రెడ్డిలకు
కు రాఖీ కట్టిన సీతక్క
ఆకేరు న్యూస్,హైదరాబాద్ :
రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలని కంకణం కట్టుకున్న ఈ చేయికి రాఖీ కట్టడం నా అదృష్టం. సోదరుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం నెరవేరి,తెలంగాణ ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలకు రాఖీ కట్టారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదే విదంగా ఏఐసిసి సెక్రెటరీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల సహా ఇంచార్జి విశ్వనాథన్ కు, ఏఐసిసి తెలంగాణ పూర్వ ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
————————