
ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
*ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ( Hyderabad ) మహా నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) వెల్లడించారు. హైదరాబాద్ నగరంతో పాటు మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్లలో లక్షా 50 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అందుకు ప్రణాళికలు సిద్ధం చేసి.. త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. గోపన్‌పల్లిలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రులు వెంకట్‌రెడ్డి, పొంగులేటి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ ప్రారంభించారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం అన్నారు. హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. లండన్ థేమ్స్ నదిలా మూసీని సుందరీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలా మాట ఇచ్చి తప్పడం ఉండదని స్పష్టం చేశారు.
—————————-