
* మూడువంతులు కబ్జాకు గురైన బతుకమ్మ కుంట
* హైడ్రా జోక్యంతో మిగిలిన 5.15 ఎకరాలు చెరువుగా పునరుద్ధరణ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : కబ్జాదారుల , రియల్ ఎస్టేట్ వ్యాపారుల చెర నుండి ఎట్టకేలకు బతుకమ్మ కుంట(BATHUKAMMA KUNTA)కు విముక్తి లభించింది..హైడ్రా చొరవతో బతుకమ్మ కుంటకు పూర్వ వైభవం రానుంది. హైదరాబాద్ అంబర్ పేట (AMBERPETA) ప్రాంతంలో ఉన్న బతుకమ్మ కుంట చెరువును శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) ప్రారంభంచనున్నారు.2500 మందితో కలిసి సీఎం రేవంత్ రె్డ్డి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. దీంతో బతుకమ్మ కుంటకు బతుకమ్మ పండగ వేళ పూర్వ వైభవం రానుంది,
మూడువంతులు కబ్జాకు గురి…
కబ్జాదారుల, రియల్ వ్యాపారుల, రాజకీయ నాయకుల్లో నలిగి నలిగి కబ్జాకు అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంట వైశాల్యం ఒకప్పుడు 16.13 ఎకరాలు. 1962 63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 563 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఫుల్ ట్యాంక్ లెవల్ బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు.అయితే దశాబ్దాల కాలంగా కబ్జాలతో కుచించుకుపోయి ప్రస్తుతం 5.15 ఎకరాల భూమి మిగిలిఉంది. హైడ్రా అధికారులు కొరడా ఝులిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో 5. 15 ఎకరాలను మళ్లీ చెరువుగా పునరుద్ధరించారు. కొంత మంది ప్రైవేట్ వ్యక్తులు హైడ్రాకు అడ్డుపడాలని కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇదంతా ఒకప్పుడు చెరువే నని కోర్టులో హైడ్రా అధికారులు రుజువు చేశారు. న్యాయస్థానం కూడా ఒకప్పుడు బతుకమ్మకుంట ప్రాంతం అంతా చెరువేనని గుర్తించింది. మిగిలిన 5.15 ఎకరాలు పూర్తి వ్యర్థాలతో చెత్తా చెదారంతో నిండి ఉండగా ప్రభుత్వం చెత్తా చెదారాన్ని అంతా తొలగించి చెరువు పరిసరాల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. మిగిలిన బతుకమ్మ కుంటను చెరువుగా పునరుద్ధరించి నేడు బతుకమ్మ వేడుకలకు సిద్ధం చేసింది.సుమారు రూ.7.40 కోట్ల నిధులతో దీన్ని పునరుద్ధరించింది. మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ కుంటను హైడ్రా పునరుద్ధరించడం ద్వారా ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ప్రదేశం ఇప్పుడు అందమైన సుందర వాతావరణంగా మారింది. బతుకమ్మ పండుగ సందర్భంలో మహిళలకు, కుటుంబాలకు ఒక విశేషమైన సాంస్కృతిక వేదికగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ప్రత్యేకమైన చిల్డ్రన్స్ ప్లే ఏరియా , ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేశారు.
ఒకప్పుడు సరస్సుల నిలయం
హైదరాబాద్ నగరం ఒకప్పుడు సరస్సులతో కళకళలాడింది. నగరంలో దాదాపు మూడు వేల సరస్సులు ఉండేవని అంటారు.1970 ప్రాంతంలో ఉన్న వేలాది నీటి వనరులలో నేడు దాదాపు 500 మాత్రమే మనుగడలో ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం ఆక్రమణల కారణంగా కనుమరుగయ్యాయి లేదా ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థలు రియల్ ఎస్టేట్ చేతుల్లో కనుమరుగయ్యాయి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం, 1979 , 2023 మధ్య నగరంలోని చెరువులు 61 శాతం తగ్గాయి. 56 సరస్సులు ఆక్రమించిన ప్రాంతాన్ని పరిశీలించగా, ఈ సరస్సుల మొత్తం వైశాల్యం 40.35 కిమీ2 (15.58 చదరపు మైళ్ళు) 16 కిమీ2 (6.2 చదరపు మైళ్ళు) నుండి తగ్గిపోయిందని తేలింది. ఈ సరస్సులలో చాలా వరకు పూర్తిగా కనుమరుగయ్యాయి మిగిలి ఉన్న సరస్సులు కుంచించుకుపోయి చిన్న చిన్న కుంటలుగా కాలువలుగా మారాయి. తీగల్ కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మాసబ్ ట్యాంక్ వంటి కొన్ని సరస్సులు పూర్తిగా కనుమరుగయ్యాయి.పికెట్ సరస్సు ఉన్న స్థానంలో నేడే జూబ్లీ బస్టాండ్ వెలసింది. ఇప్పుడు ఐటీ హబ్ గా మారిన మాదాపూర్ కూడా ఒకప్పుడు చెరువులు ఉన్న ప్రాంతమే..మాసాహె ట్యాంక్ ఇప్పుడు మాసాబ్ ట్యాంక్ అయింది.హైదరాబాద్‌లోని అతిపెద్ద సరస్సు అయిన హుస్సేన్ సాగర్ వైశాల్యం 40% కంటే ఎక్కువ తగ్గిపోయింది, అంటే కేవలం 30 సంవత్సరాలలో 550 హెక్టార్ల నుండి 349 హెక్టార్లకు తగ్గింది. ఈ సరస్సును 1575 ADలో నిర్మించారు. అదేవిధంగా, షామిర్‌పేట సరస్సు ఆక్రమించిన ప్రాంతం 1989లో 486 హెక్టార్ల నుండి 2006లో 256 హెక్టార్లకు తగ్గింది. మొత్తంగా 12 సంవత్సరాలలో (1989 నుండి 2001 వరకు) దాదాపు 3245 హెక్టార్ల నీటి వనరులు పోయాయి.
హైడ్రాతో మళ్లీ ఊపిరి
మిగిలి ఉన్న చెరువులను పునురుద్దరించడానికి హైడ్రా నడుం బిగించింది. దానిలో భాగంగా బతుకమ్మ కుంటకు పూర్వవైభవం తీసుకొచ్చింది. అలాగే ఉప్పల్‌లోని నల్ల చెరువు,దుర్గం చెరువు,మల్కం చెరువు పాత బస్తీలో ఉన్న చెరువును హైడ్రా అధికారులు పునరుద్ధరించనున్నారు.
…………………………………………………….