ఆకేరున్యూస్, ఖమ్మం: సీఎం రేవంత్‌రెడ్డి సూర్యపేట, ఖమ్మం జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి అక్కడి స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
————————–