* జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్
ఆకేరున్యూస్, జయశంకర్ భూపాలపల్లి: భారీ వర్షాలతో చెరువులు, వాగులలో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఐతే తప్ప బయటకి రావద్దని, రైతులు పొలాల దగ్గరకి వెళ్లినప్పుడు కరంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ బోనాల కిషన్ అన్నారు . ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో చిట్యాల మండలం నైన్ పాక, భూపాలపల్లి మండలం మొరoచపల్లిలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ మల్లేశ్ తో కలిసి మొరoచ వాగు వరదను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు, వైర్లకు తాకకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు, చెరువులు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉందని, వాటి వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు. గోదావరి, మానేరు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలు, మత్స్యకారులు, ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదన్నారు. వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతో నడపాలని సూచించారు. పిల్లలు, యువకులు చెరువులు నది దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. విపత్కర పరిస్థితిలో ప్రజలకు సేవలoచడానికి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉన్నారని స్పష్టం చేశారు. ఎటువంటి సహాయం కావాలన్నా డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ అధికారులకి ఫోన్ చేయాలని అదనపు ఎస్పీ కోరారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
