
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడిరది. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ ఆశావహులకు ఆడియాశలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించినా.. సీఎం పర్యటన వాయిదా పడడంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. కాగా.. ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. శుక్రవారం పార్టీ వ్యవహారాలపై చర్చించాలని హైకమాండ్ వారికి సూచించింది. కానీ రేవంత్ పర్యటన వాయిదా పడడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
……………………………………………