
* పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
ఆకేరు న్యూస్, వనపర్తి : వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. అనంతరం జెడ్ పీహెచ్ఎస్ (ZPHC)ను సందర్శించారు. అక్కడి సమస్యలను తెలుసుకుని సత్వరం పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం పార్టీ ముఖ్యులతో, సన్నిహితులతో భేటీ అయ్యేందుకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నారు. ఈకార్యక్రమాల అనంతరం సాయంత్రం ఎస్ ఎల్బీసీ (SLBC)వద్దకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షించనున్నారు.
………………………………….