
ఆకేరున్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ప్రమాదం జరిగిన నేపథ్యంలో సీఎం ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు టన్నెల్ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తారు. కాగా, ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వచ్చిన ఎనిమిది మంది అభాగ్యుల కుటుంబాల్లో ఈ దుర్ఘటన చిచ్చు పెట్టింది.
………………………………….