
* దొంతి మాధవరెడ్డి తల్లికి నివాళులర్పించిన సీఎం
ఆకేరు న్యూస్ హనుమకొండ : నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మఇటీవలే మృతి చెందిన విషయం తెల్సిందే . బుధవారం వంద ఫీట్ల రోడ్డులో ఉన్న పీజీఆర్ గార్డెన్ లో కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మాధవ రెడ్డిని ఎమ్మెల్యే సోదరులను కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ చిత్రపటంపై పూలు చల్లి నివాళులర్పించారు. సీఎం వెంట జిల్లా ఇన్ చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు కొండా సురేఖ,సీతక్క, వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
………………………………………………..