* ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర,ఎస్ పి. శబరిష్ అధికారుల బృందం.
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని సమ్మక్క సారలమ్మ ఆదివాసి ఆరాధ్య దైవాలు వెలసిన మేడారానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి . ఈనెల 23న రానున్నారు దీనిని పురస్కరించుకొని ఆదివారం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరిష్ అదనపు కలెక్టర్ మహేందర్ జి, లతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నత అధికారులు దేవాదాయ శాఖ అధికారులు పూజారులతో మేడారం పరిసరాలలో కలియతిరిగారు. సీఎం రాకకు భారీ ఏర్పాట్లు చేయాలని ఈ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పోలీస్ అధికారులతో రూట్ మ్యాప్ ను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పకడ్బందిగా చేపట్టాలని సూచించారు.
అంతేకాకుండా సీఎం రాకను పురస్కరించుకొని ఆర్ అండ్ విశాఖ ఆధ్వర్యంలో హేలిప్యాడ్ ను సిద్ధం చేశారు.
…………………………………………..
