ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా, సాంప్రదాయ సౌందర్యానికి ప్రతి రూపంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా జరుపుకునే పూల పండుగ బతుకమ్మ సందర్భంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
మన తల్లులు, అక్కాచెల్లెళ్లు భక్తి శ్రద్దలతో అలంకరించే బతుకమ్మలు కేవలం పూల సమాహారమే కాదని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సామూహిక జీవన సౌందర్యానికి సజీవ రూపమని పేర్కొన్నారు. బతుకమ్మ పూలతో ప్రకృతిని ఆరాధించడం, గౌరమ్మను సత్కరించడం, సోదరీమణులు కలసి పాడుతూ, ఆడుతూ జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయన్నారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వుకీ ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయని…తిరొక్క పూలతో ప్రకృతి మాతకు కృతజ్ఞత చాటే పండగ బతుకమ్మ అని కొనియాడారు. ఈ బతుకమ్మ పండుగ ప్రతి ఇంటిని సంతోషాలతో నింపాలని, మన తెలంగాణ తల్లికి మరింత కీర్తి చేకూర్చాలని ఆకాంక్షించారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
