* ఫేక్ బిల్లులతో క్లైమ్
* సీఎం రేవంత్ ఆదేశాలతో రంగంలోకి సీఐడీ
* 28 ఆస్పత్రులపై కేసులు నమోదు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రోగులకు చికిత్స చేయకుండానే కొన్ని ఆస్పత్రులు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పొందినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సీఎంఆర్ఎఫ్ స్కాం (CMRF Scam) తెలంగాణ(Telangana)లో సంచలనంగా మారింది. రంగంలోకి దిగిన సీఐడీ(CID) 28 ఆస్పత్రులపై కేసులు నమోదు చేసింది. హైదరాబాద్(Hyderabad), రంగారెడ్డి(Rangareddy), నల్గొండ(Nalgonda), కరీంనగర్(Karimnagar), మహబూబ్బాద్(Mahaboobabad)లో ఉన్న ఆస్పత్రులపై కేసులు నమోదు అయ్యాయి. రోగులు లేకుండా, వైద్యం చేయకుండా.. కేవలం కాగితాల్లోనే పెద్ద జబ్బులున్నట్లు పేర్కొంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సీఎంఆర్ఎఫ్(CMRF) నిధులను డ్రా చేస్తున్నారంటూ గత ఏడాది రెవెన్యూ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కాం బయటపడింది. ఈ స్కామ్లో ఆసుపత్రుల సిబ్బంది, లోకల్ లీడర్లు, అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెలుగులోకి రావడంతో.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanthreddy) సీఐడీ విచారణకు ఆదేశించారు. మొత్తం 28 ఆస్పత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
—————————