* ఆసక్తికర వ్యాఖ్యలు చేసే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) ఈరోజు మీడియాతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంతో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం మీడియా సమావేశం (PRESS MEET)ఏర్పాటు చేస్తుండడం ఆసక్తిగా మారింది. ఒక పక్క ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తుంటే.., పోటీగా విపక్షాలు సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలో సీం రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలపై ఉత్కంఠ ఏర్పడింది. అలాగే, మరిన్ని పథకాలను ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. మహిళలకు నెలకు రూ.2500, పింఛన్ల మొత్తం పెంపు తదితర అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. సాయంత్రం జరిగే సమావేశంలో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
………………………………………