* కొనసాగుతున్న సహాయక చర్యలు
* ఏపీలో జోరు వానలు.. అచ్చంపేటలో వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
* పొంగుతున్న వాగులు
* గుంటూరు – తూళ్లూరు మధ్య రాకపోకలు బంద్
* తెలంగాణకూ అలర్ట్
ఆకేరు న్యూస్, విజయవాడ: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు మొదలుయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడ(vijayawada)లో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయ్యాయి. కాగా మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడడం కలకలం రేపింది. నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. శకలాల కింద జనం చిక్కుకుపోయారు. అధికారులు రెస్క్యూ ఆపరేషన్(resquie operation) కొనసాగిస్తున్నారు. ఇల్లు కూలి ఒకరు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో రెండు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. బస్టాండ్ సమీపంలో లోలెవల్ బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు గోతుల్లో దిగబడి ఇరుక్కుపోయాయి. పల్నాడు(palnadu)జిల్లా అచ్చంపేటలో ఆర్టీసీ బస్సు వరదల్లో చిక్కుకుంది. వాగులు పొంగిపొర్లడంతో గుంటూరు – తూళ్లూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలాఉండగా.. భారీ వర్షాల కారణంగా విశాఖ, ఎన్టీఆర్, అనకాపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఇక, రానున్న 24 గంట్లలో అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. శనివారం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో..
తెలంగాణ(telangana)లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు(heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణం కేంద్రం తెలిపింది. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. 13జిల్లాలకు ఎల్లో అల్లర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో మోస్తరు వర్షంవ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉదయం నుంచీ ఆకాశం మేఘావృతమై ఉంది. పలుచోట్ల వర్షం మొదలైంది.
—————-