* ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం
ఆకేరున్యూస్, హైదరాబాద్: భవిష్యత్ లో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సీఎం అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం ఓ సభలో ఉత్తమ్‌ను ముఖ్యమంత్రిగారూ అని ఆయన సంబోధించారు. గతంలోనే ఉత్తమ్ కు సీఎం పదవి కొద్దిలో మిస్ అయిందని, ఈ సారి మాత్రం పక్కాగా ఆయనకే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందన్నారు. నా నాలుకపై నల్ల మచ్చలు ఉన్నాయని, నేను ఏదంటే అది జరిగి తీరాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.