
ఆకేరు న్యూస్, ములుగు: వినాయక చవితిని పురస్కరించుకొని వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, రసాయనాల వినియోగం వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుచున్నాయని, అందువలన కృత్రిమ రంగులు, రసాయనాలతో చేసిన విగ్రహాలను మానివేసి మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జితో కలసి వినాయక చవితి పండుగ ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు, మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణంపై అహగహన కార్యక్రమాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిర్వహంచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
చెరువుల్లో మట్టి మేటలని తొలిగించటానికి చెరువులో స్వచ్చత కాపాడటానికి వినాయక చవితి సందర్భంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని కలెక్టర్ కోరారు. మట్టి విగ్రహాలను పూజించి చెరువులను కలుషితం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, కాలుష్య నియంత్రణ మండలి ఏ ఈ ఎం సుభాష్ నాయక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
……………………………………….