* మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం
* స్వయంగా వెళ్లి ఆహ్వానించిన మంత్రి పొన్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సచివాలయంలో ఈనెల 9నజరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR)ను ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR), ప్రోటోకాల్ అధికారులు ఆహ్వానించారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్(KCR FORM HOUSE)కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రం అందించారు. తన నివాసానికి వచ్చిన మంత్రి, అధికారులతో కేసీఆర్ భోజనం చేశారు. బయటకు వచ్చిన అనంతరం పొన్నం మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు తెలంగాణ సమాజంలోని అందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈరోజు ఉదయం గవర్నర్‌ను, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కూడా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా తాము కేసీఆర్ ను ఆహ్వానించామని, వచ్చేది.. లేనిది.. ఆయన ఇష్టమని పొన్నం చెప్పారు.
…………………………………….