
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు 130 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థ తనకు కేటాయించిన బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించడం శుభ పరిణామంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే సందర్భమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.
…………………………………………..