* తప్పిన పెనుముప్పు
ఆకేరున్యూస్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిలా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందులు చల్లారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండటంతో పాఠశాలలోని వంట గదికి సిబ్బంది తాళాలు వేసుకుని వెళ్లి సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన సిబ్బంది వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో దుర్వాసన, నురగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది చుట్టుపక్కల చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. అలాగే తాగునీటి ట్యాంక్లోనూ పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమయానికి పాఠశాల సిబ్బంది గుర్తించి మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
…………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
